

సత్యం వార్త / నంద్యాల / జనవరి 12 :
స్థానిక పట్టణంలోని ప్రధమనందీశ్వర దేవస్థానంలో ఈనెల 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు శివమాలధారణ ధరించిన శివ స్వాముల భిక్ష కార్యక్రమానికి మార్కెట్ ప్రసాద్ ఉచితంగా కూరగాయలను అందజేస్తూ విశేష సేవాభావం చూపుతున్నారు.
ప్రతి రోజు దేవస్థానంలో నిర్వహించే శివ స్వాముల భిక్షకు అవసరమైన కూరగాయలను తన ఖర్చుతో ఉచితంగా అందజేస్తానని మార్కెట్ ప్రసాద్ తెలిపారు. శివ భక్తుడిగా సమాజ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు.
గత అనేక సంవత్సరాలుగా మార్కెట్ ప్రసాద్ పలు దేవస్థానాలలో జరిగే అన్నదాన కార్యక్రమాలకు నిరంతరంగా కూరగాయలను ఉచితంగా అందజేస్తూ సేవా గుణానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవల వల్ల వందలాది భక్తులకు లబ్ధి చేకూరుతుందని దేవస్థాన నిర్వాహకులు తెలిపారు.
శివ స్వాముల సేవలో అంకితభావంతో ముందుకు సాగుతున్న మార్కెట్ ప్రసాద్‌కు భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రధమనందీశ్వర దేవస్థానం అన్నదాన నిర్వాహకులు ఆకాంక్షించారు.
